మార్కండేయ గోత్ర పద్మశాలి చరిత్ర :
పద్మశాలి చరిత్ర : ( ప్రామాణికమైన పురాణ referencesతో)
మనం ఎప్పుడు కృష్ణ ద్వైపాయనడు వేద వ్యాస మహర్షి( శ్రీ మహా విష్ణు అవతారం) విరచితమైన 18 పురాణాలు 54ఉప పురాణాలు ఆధారంగా తీసుకోవాలి, అందులో బ్రహ్మాండ పురాణము, విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, నరసింహ పురాణంలో, వాయు పురాణం ఉన్న విషయాలు గమనించినట్లైతే ఈ విధముగా మార్కండేయ మహర్షి వంశ చరిత్ర చెప్పబడినది :
భృగు మహర్షి యొక్క భార్య ఖ్యాతి. ఈమె దేవతలు అయిన ధాతృ మరియు విధాతృ అనే పుత్రులకు మరియు శ్రీ దేవి అనే పుత్రికకు జన్మనిచ్చిoది. ధాతృ మరియు విధాతృ పెద్దక్కగా శ్రీ దేవి అమ్మవారు జన్మించారు. శ్రీ దేవి అమ్మవారు భగవంతుడైన నారాయణ స్వామికి భార్య అయ్యింది, వారికి బల మరియు ఉత్సాహ అనే కుమారులు పుట్టారు. ఆయతి మరియు నియతి వీరిద్దరు మహాత్ముడైన మేరుపర్వతుడి పుత్రికలు వీళ్ళు ధాతృ మరియు విధాతృ దేవ సోదరులకు భార్యలు అయినారు. ధాతృ ఆయతిలకు ప్రాణ మరియు విధాతృ నియతిలకు మృకండు అనే కుమారులు పుట్టారు. మృకండు మహర్షి భార్య మనస్వినీ ఈ దంపతులకు మార్కండేయ మహర్షి జన్మించారు. మార్కండేయ మహర్షి భార్య పేరు ధూమ్రవతి వారికి వేదశిరస అనే పుత్రుడు జన్మించాడు. ఈ వేదశిరస ఋషి వరాహ కల్పంలో 7వ మన్వంతరంలో శివుని యొక్క యోగాచార్య అవతారం. వేదశిరస మహర్షి భార్యలు శుచి మరియు పీవరీ. ఈ వేదశిరస మహర్షి పీవరీల యొక్క కుమారులు అయిన మార్కండేయ వంశస్థులు వేద పండితులుగా బ్రహ్మాండ పురాణంలో అనుసంగ పాదంలో సూత మహర్షి వారు తెలిపారు. వేదశిరస మరియు శుచి అనబడే అప్సరసకు ధూపపాప అనే కుమార్తె పుట్టింది, ధూపపాప ధర్మ మహర్షిలకు వివాహం అయ్యింది. వేదశిరస మహర్షి భార్య పీవరీకు అనేక మంది పుత్రులు కలిగారు వారందరిని మార్కండేయులు అంటారు. వేదశిరస మహర్షి పీవరీల అనేక మంది కుమారులు సంతానం నుండి మాత్రమే భృగు వంశస్థులు అయిన మార్కండేయ వంశము అభివృధి చెందింది. వారందరు మహర్షులు మరియు వేదపండితులుగా వాయు పురాణంలో చెప్పబడినది. కాల క్రమేణా మార్కండేయ గోత్రాలు వారు బ్రాహ్మణ వృత్తిన్ని విడచి చేనేత వృత్తి స్వీకరించింది అప్పుడు శైవ వైష్ణవ సంఘర్షణలు వల్ల, అనేక జైన, బౌద్ధ అవైదిక దండయాత్రలు మరియు మతమార్పిడులు వల్ల,
కుల భేదాలు వల్ల చాలా ఋషి గొత్రాలు వారు సాంప్రదాయ వృత్తులు వదిలి పని వృత్తులు చేపట్టారు. వస్త్రాలు దేవస్థానములకు అవసరమై మార్కండేయ గోత్రాలు వారు చేనేత వృత్తి చేపట్టి పద్మశాలి కులం ఏర్పడింది. ముందు ఉపనయనము మరియు వేద విద్య మొదలగు బ్రాహ్మణ సాంప్రదాయాలు ఉన్నా, కాల క్రమేణా కలియుగ మొదటి పాదం అంత్య దశలో కలియుగ ప్రభావం వల్ల అవ్వన్ని తొలగిపోయాయి. కాల క్రమేణా భారత వస్త్ర తయారీలో అత్యుత్తమ భారతీయ వస్త్ర సంప్రదాయము ఉట్టిపడేలా, వస్త్ర కళాఖండాలు, భారతీయ వస్త్ర సంపదకు మూలంగా పద్మశాలి వంశము అభివృద్ధి చెందింది.
గమనిక:
మన పద్మశాలి చరిత్ర మరియు మార్కండేయ చరిత్రలో ప్రస్తుతం ప్రచారములో వున్న కథ ఒక కాల్పనిక కథ అందులో ఎలాంటి వాస్తవాలు లేవు మార్కండేయ మహర్షి పుత్రుడు భావన ఋషి & అతని భార్య భద్రవతి అని అంటారు అది అసలు నిజం కాదు. భావన ఋషి మరియు భద్రవతీ దేవి కథ, మార్కండేయ మహర్షికి భావన ఋషి జన్మించినట్టు ఎక్కడ వేదవ్యాసుల వారు ప్రొక్తమైన 18 మహా పురాణములలో గాని, 54 ఉప పురాణములలో గాని, మహాభారతంలోని గాని, వాల్మీకి సంస్కృత రామాయణంలో గాని కనబడదు. కాల క్రమేణా ప్రతీ కులానికి ఒక చరిత్ర కథ అవసరం అయినది గోత్రం ప్రకారం మార్కండేయ కథ శివుడిని వరం పొందినంత వరకు ఉన్న కథ లోకం అంతటా ప్రాచుర్యంలో ఉంది దాన్ని కారణంగా అక్కడ వరకు వున్న కథ మాత్రమే ఇప్పటికీ చెక్కు చెదరలేదు సత్యం కూడా, కానీ దాని తరువాత వచ్చిన భావన ఋషి కథ కాల్పనిక మాత్రమే ఇందుకు బలమైన ఆధారం మార్కండేయ పురాణంలో 54 అధ్యాయములో మార్కండేయ మహర్షి స్వయముగా తన పుత్రుడు వేదాశిరశ మహర్షి మరియు అతనికి అతను భార్య పీవరీ నుంచి మాత్రమే అనేక మంది బ్రాహ్మణులు వేదపండితులు పుట్టారు వారినే భృగు వంశస్థులైన
మార్కండేయులు అంటారు. మార్కండేయ గోత్రం అప్పట్టి నుంచి ప్రారంభమైనది. ఈ వంశ చరిత్ర బ్రహ్మాండ పురాణం అనుసాంగ పాదం 11వ అధ్యాయములో కూడ వివరించబడింది. ఋషి సంబంధమైన గోత్రాలు, దేవత గోత్రాలు, సూర్య వంశ , చంద్ర వంశాలు, రాజుల చరిత్రలు మనకి వేద వ్యాస విరచిత పురాణములలో మరియు సంస్కృత మహాభారతం ఇతిహాసాలులో వంటి గ్రంథాలులో సులువుగా ప్రామాణికంగా లభ్యమౌతాయి. వాటిని మాత్రమే నిజమైన సమాచారంగా మనం పరిగణించాలి
Proofs & References :( మార్కండేయ వంశ చరిత్రను తెలిపే ప్రామాణిక గ్రంథాలు)
1. బ్రహ్మాండ పురాణం అనుసాంగ పాదం 11వ అధ్యాయము.
2. స్కాంద పురాణంలో కాశి ఖండం.
3. నరసింహ పురాణం మార్కండేయ చరిత్ర.
4. మార్కండేయ పురాణము 54 అధ్యాయములో
స్వయముగా మార్కండేయ మహర్షి తన వంశ చరిత్ర వివరించారు.
5. విష్ణు పురాణం 1వ భాగములో 10వ అధ్యాయము.
6. గరుడ పురాణములో అగస్త్య సంహిత 5వ
అధ్యాయము.
Comments
Post a Comment